పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం కమిటీ

85చూసినవారు
పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం కమిటీ
దేశంలో నీట్, యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ దుమారం చెలరేగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్‌ కె. రాధాకృష్ణన్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది. ఇందులో డా. రణ్‌దీప్‌ గులేరియా లాంటి పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్