ట్రాఫిక్‌ పోలీస్‌ను కారుతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ (వీడియో)

65చూసినవారు
మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఓ వ్యక్తిని ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనం పత్రాలు చూపించాలని అడిగాడు. అయితే తప్పించుకునేందుకు ఆ డ్రైవర్‌ కారును వేగంగా ముందుకు నడిపాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ను కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు వెంటనే స్పందించి ఆ అధికారిని కాపాడారు. ఈ వీడియో క్లిప్‌ నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్