భారత కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. రోహిత్ శర్మ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా, నాలుగో భారత ప్లేయర్‌గా రోహిత్ నిలుస్తాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ సాధిస్తే.. రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో బంగ్లాపై శతకం నమోదుచేసిన తొలి ఆటగాడిగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 50, అంతకంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన 10వ బ్యాటర్‌గా ఘనత అందుకుంటాడు.