మహిళలను థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఈ థైరాయిడ్‌తో పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్ సమస్యకు శరీరంలోని హార్మోన్ స్థాయుల్లో తేడాలే కారణమని వైద్యులు చెప్తున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి కనీసం ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లు సూచించిన ప్రకారం మందులు వాడాలి. ఆహార నియమాలను పాటించాలి. వ్యాయామం చేయాలి.