మొలకెత్తిన బంగాళ దుంపలను తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే చాన్స్ ఉంటుంది. దీని మొలకల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషయపూరితమైన రసాయన పదార్థాలు ఉంటాయి. మొలకెత్తినవి లేదా ఆకుపచ్చగా మారిన బంగాళ దుంపల్లో సోలనైన్, చాకోనైన్ ఉత్పత్తి అవుతుంది. వీటిలో హానికారక టాక్సిన్‌లు ఉంటాయి. వీటిని తినడం వల్ల వాంతులు, కడుపులో నొప్పి, వికారం వంటి సమస్యలకు కారణం కావొచ్చు.