AP: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు రైతులకు తీరని ద్రోహం చేశారని అన్నారు. పర్ట్ అప్రైజల్ కమిటీలో సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల రాయలసీమ ఎత్తిపోతల తొలిదశ పనులకె పరిమితమైందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ఆయన అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి సాగిలపడి, నీటి హక్కులన్నీ ఒదులుకున్నారని విమర్శించారు.