ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దావోస్ పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ అక్కడి భారత రాయబారి మృదుల్‌కుమార్‌తో భేటీ అయ్యారు. మృదుల్‌కుమార్‌తో వివిధ అంశాలపై చర్చించారు. మరోవైపు, కాసేపట్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది. అనంతరం అక్కడి తెలుగువారితో చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.