ఏపీలో మళ్ళీ పవర్‌లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఏపీలో తిరుగులేని మెజారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు తెలంగాణలో పార్టీకి జవసత్వాలు సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్న వేళ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని టీడీపీ చూస్తోంది.