మిర్చి రైతులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చైనా ఆర్డర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత ప్రకటించారు. దీంతో ఈ నెలాఖకు ధరలు పెరిగే అవకాశం ఉందని సునీత రైతులకు తియ్యని కబురు చెప్పారు. ధరలు పెరగకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మిర్చి ఎగుమతులను పెంచడానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.