భారత సరిహద్దులో చైనా అధునాతన యుద్ధ విమానాలు

50చూసినవారు
భారత సరిహద్దులో చైనా అధునాతన యుద్ధ విమానాలు
భారత్‌ సరిహద్దులో యుద్ధ విమానాలను చైనా మోహరించింది. సిక్కిం సమీపంలో అధునాతన స్టెల్త్ ఫైటర్స్‌ను ఉంచింది. మే 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయపడింది. సిక్కింకు 150 కి.మీ. దూరంలో సైనిక, ప్రజల అవసరాల కోసం వినియోగించే ఎయిర్‌పోర్ట్‌ను చైనా నిర్మించింది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు అధునాతన జే-20 ఫైటర్‌ జెట్‌లతోపాటు ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కేజే-500 కూడా ఇక్కడ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్