భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపే వంతెనను పూర్తిచేసిన చైనా దాన్ని వినియోగంలోకి కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం వలన ప్యాంగాంగ్ నది ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపే దూరం 50 నుంచి 100 కిలోమీటర్ల మేర తగ్గనుంది.