చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది. తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది. దీనిని ఆ దేశానికి చెందిన సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారు చేసింది. రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సిచవాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు 20 నిమిషాల పాటు అది ప్రయాణించింది.