ఐదుగురు మనవరాళ్లతో చిరంజీవి ఫొటో వైరల్

68చూసినవారు
ఐదుగురు మనవరాళ్లతో చిరంజీవి ఫొటో వైరల్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మీరు చూస్తున్నది శక్తివంతమైన పిడికిలోని ఐదు వేళ్లు. సినిమాలు, దాతృత్వంలోనే కాకుండా నాన్న, మామ, తాతగా మా అందరికీ స్పూర్తిగా నిలిచిన మామకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. ఈ ఫొటో క్యూట్‌గా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్