AP: నెల్లూరు సీతారామపురం మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగింది. సామాజిక తనిఖీ ప్రజావేదికలో సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది. ఏపీవో, ముగ్గురు టీఏలు, ఇద్దరు సీవోలు, ఏడుగురు ఎఫ్‌ఏలు సస్పెండ్ చేశారు. బాధ్యుల నుంచి రూ. 30.52 లక్షలు రికవరీ చేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.