AP: పులివెందుల వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త డేవిడ్, కౌన్సిలర్ కిశోర్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. 2 వర్గాల నాయకులు పిల్లల గొడవ విషయమై కలగజేసుకున్నారు. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.