యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ సమీపంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. మఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బిల్టిగఢ్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. స్థానికంగా ఓ గెస్ట్ హౌస్‌కు పెళ్లి వారు ఊరేగింపుగా వచ్చారు. అక్కడ అతిథులు వెంటనే విందు ఆరగించారు. దీంతో విందులో రసగుల్లా అయిపోయింది. రసగుల్లా విషయంలో వధువు-వరుడు బంధువుల మధ్య ఘర్షణ చెలరేగింది. కొద్ది సేపటికే వారంతా దారుణంగా కొట్టుకున్నారు.