సెలవుల్లో క్లాసులు.. 27 కాలేజీలపై చర్యలు

79చూసినవారు
సెలవుల్లో క్లాసులు.. 27 కాలేజీలపై చర్యలు
తెలంగాణలో వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజీలపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సెలవుల్లో క్లాసులు, అడ్మిషన్లు నిర్వహించిన 27 ప్రైవేట్ కాలేజీలకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. సెలవుల్లో క్లాసులు, ప్రవేశాలు కల్పించొద్దనే ఆదేశాలు ఇచ్చినా.. పలు కాలేజీలు ధిక్కరిస్తున్నాయని పేర్కొంది. ఇంకా తనిఖీలు చేస్తున్నామని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్