హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాగా, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది చనిపోయి ఉంటారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతే అధికారికంగా ప్రకటించగలమని తెలిపారు. బుధవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ తో కులు, మండి, సిమ్లాలో వరదలు సంభవించాయి.