బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం

60చూసినవారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశ బెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు HYD-కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, ఆర్ధిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ మీటింగ్‌కి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్