సాయి పల్లవి కొన్ని రోజులగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని 'తండేల్' డైరెక్టర్ చందు మొండేటి ఓ కార్యక్రమంలో తెలిపారు. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజులు విశ్రాంతి అవసరం అని సూచించడంతో రెస్ట్ తీసుకుంటున్ననట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముంబయిలో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రాలేదని పేర్కొన్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇది సాయిపల్లవి, నాగచైతన్య కలిసి నటిస్తున్న రెండో చిత్రం.