హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్‌లోని ఆడమ్స్ ఈ బైక్ షోరూంలో ఒక్కసారిగా బైకుల బ్యాటరీలు పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలా వరకు ఎలక్ట్రిక్ బైకులు కాలిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.