ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగేందుకు చైనా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రెన్యువబుల్‌రెన్యువబుల్ ఎనర్జీ పరిశోధనల్లో భాగంగా చేపట్టిన కృత్రిమ సూర్యుడిని సృష్టించడంలో కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా తాజాగా కృత్రిమ సూర్యుడిని 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఏకంగా 18 నిమిషాల పాటు వెలిగించింది. ఇది సూర్యుడిపై ఉండే టెంపరేచర్‌తోటెంపరేచర్ తో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.