ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్‌కు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభించగా, దీపావళి(31వ తేదీ) నుంచి ఉచిత సిలిండర్లను డోర్ డెలివరీ చేస్తామని పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న విషయం తెలిసిందే.