చైనాలో వినియోగదారులు చేయి చూపించి పేమెంట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన సోషల్ మీడియా ఖాతాలో ‘పామ్ పేమెంట్స్’ గురించి వీడియో పోస్ట్ చేశారు. యూజర్లు తమ అరచేతిని ఓ స్కానర్‌లో పెట్టి మొబైల్ యాప్ సాయంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లకు అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత అర చేతిని చూపించి సెకన్లలో పేమెంట్స్ పూర్తి చేయొచ్చు.