తెలంగాణలోని రైతులు, మహిళలు సహా అందరినీ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున రూ.30వేలు సీఎం రేవంత్ బాకీ పడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రాష్ట్రంలోని ఒక్కో రైతుకు ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు, రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు.