ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ సమీక్ష

60చూసినవారు
హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ ఆదివారం సమీక్ష చేపట్టారు. ఆస్పత్రి రహదారులపై పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను నియమించారు.

సంబంధిత పోస్ట్