TG: గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. 'పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోంది. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్.. ఇందిరమ్మ పాలన. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. ఇది హర్షణీయం' అని పేర్కొన్నారు.