నేడు రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్

558చూసినవారు
నేడు రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్