కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే: హరిదీప్ సింగ్ పూరీ

59చూసినవారు
కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే: హరిదీప్ సింగ్ పూరీ
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ తీవ్ర విమర్శలు చేశారు. “రాజకీయ విలువలు తెలిసిన వారు జైలుకు వెళ్లిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తారు. జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపటం సరికాదు. కేజ్రీవాల్ ఇంకా సీఎం కొనసాగటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నా” అని హరిదీప్ సింగ్ అన్నారు.