సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. బుధవారం ఉదయం జరిపిన ఈ వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)’ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది. పరోక్షంగా సిరియా గడ్డ నుంచి హెజ్‌బొల్లా కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని హెచ్చరించింది.