హైదరాబాద్‌లో నిర్మించనున్న కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. గోషామహల్‌లో స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ఉండడంతో ఈ ప్రక్రియను, ఇతర పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్‌లను అధికారులు వివరించగా.. సీఎం పలు మార్పులు, చేర్పులు చేశారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, మౌలిక సదుపాయాల విషయంలో సూచనలు ఇచ్చారు.