ఇటీవలి కాలంలో జరుగుతున్న పెళ్లి వేడుకలను ఉద్దేశించి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లిళ్లను తక్కువ ఖర్చుతో చేసుకోవాలని.. కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేసుకోవడం ఉత్తమం అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పెళ్ళికి వచ్చిన అతిధులకు విందును ఇవ్వడానికి భూములను అమ్ముకునే బదులు కొందరు సన్నిహితులు మధ్య వేడుకను నిర్వహించుకోవాలని సూచించారు.