మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఘటనపై విచారణకు రాష్ట్ర మహిళ కమిషన్ ఆదేశించింది. వీడియోల రికార్డు అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. లేడీస్ కాలేజీ హాస్టల్ బాత్ రూమ్‌లో వీడియోలు రికార్డులు చేశారని గత రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగగా.. ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.