బిర్యానీలో బొద్దింక.. వీడియో వైరల్

71చూసినవారు
TG: హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని రైల్ కోచ్ రెస్టారెంట్‌లో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. సగం బిర్యానీ తిన్న తర్వాత ఒక బొద్దింక బయటకు వచ్చింది. దాంతో కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే రెస్టారెంట్ నిర్వహాకులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆహార నాణ్యత విషయంలో రెస్టారెంట్స్ నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్