తెలంగాణను చలి వణికిస్తోంది. వచ్చే 2 రోజుల పాటు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన దుస్తులు వేసుకుని చలి నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు మంకీ క్యాప్‌లు, జెర్కిన్స్, చలి కోట్లు తప్పనిసరిగా ధరించాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప ఉదయం బయటికెళ్లొద్దని సూచిస్తున్నారు.