సమంత విడాకులపై కామెంట్స్.. స్పందించిన మంచు విష్ణు

57చూసినవారు
సమంత విడాకులపై కామెంట్స్.. స్పందించిన మంచు విష్ణు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. 'దురదృష్టకరమైన వ్యాఖ్యల కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నా. అసత్య కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశ కలిగిస్తోంది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకూ గౌరవం, రక్షణ అవసరం' అని విష్ణు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్