AP: భవిష్యత్తుపై భయంతోనే పిల్లలను చంపి, ఆపై చంద్రకిశోర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారని సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. "ప్రస్తుత పోటీ ప్రపంచంలో నా పిల్లలు ఎదగలేరు. దాని వల్ల భవిష్యత్తులో వారు కష్టాలు పడాల్సివస్తుంది. వాళ్ళు కష్టపడటం చూడలేను కాబట్టి నేను చనిపోతున్నా.. నాతోపాటు పిల్లల్ని కూడా తీసుకుపోతున్నాను "అని చంద్రకిశోర్ సూసైడ్ నోటులో రాసినట్లు సీఐ తెలిపారు.