వయనాడ్ బాధితులకు కేరళ సీఎం పినరయి విజయన్ బాసటగా నిలిచారు. ఇళ్లు కోల్పోయిన వారికి నెలకు రూ.6 వేలు అద్దె ఇస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 60 శాతం గాయపడిన వారికి 75 వేలు, 40- 50 శాతం గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి నుంచి చెల్లిస్తామని వెల్లడించారు.