ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ సీఈవో, హోంశాఖ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.