ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన భారత జట్టుకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.