న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీమిండియాకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ మేరకు సినీ హీరో మహేష్ బాబు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. మహేశ్ బాబు గర్వంతో ఉప్పొంగిపోయాను అని ట్వీట్ చేశారు.