న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం అద్భుత ఫలితమని అన్నారు. ఐసీసీ ఛాంపియల్స్ ట్రోఫీని మన జట్టు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించారని, అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత టీమ్‌కు అభినందనలు అని ప్రధాని ట్వీట్ చేశారు.