కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలు: మాజీ MP

73చూసినవారు
కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలు: మాజీ MP
కాంగ్రెస్ ప్రభుత్వం భాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. బీజేపీ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ.. '6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. రైతుల రుణమాఫీకి 32 వేల కోట్లు కావాలి, సాధ్యమయ్యే పనేనా..? అధికారంలోకి వస్తే 5కేజీలు కాదు 10 కేజీలు బియ్యం ఇస్తామని ఖర్గే చెబుతున్నారు.. ఖర్గే కనీస ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్