పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతులు ఢిల్లీ మార్చ్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది. అంతేకాకుండా 163 సెక్షన్‌ను అమలు చేసింది. రైతుల శాంతియుత నిరసనలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.