కాంగ్రెస్‌పై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2024లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 'జార్జ్ సోరోస్' డబ్బు వినియోగించిందని ఆరోపించారు. కర్ణాకటలో 4 శాతం ముస్లిం కోటాపై మాట్లాడుతూ.. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్‌కి తీవ్ర అవమానమని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తప్పుడు ప్రచారాన్ని చేయడమే కాకుండా, విదేశీ డబ్బును వినియోగించారని ఆరోపించారు.