తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం కాంగ్రెస్‌దేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తెలంగాణ సీఎంగా ఉంటారని మంగళవారం ఆయన అన్నారు. అనర్హత వేటు పడుతుందని కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తున్నారని వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.