ఏప్రిల్‌ 8న కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం

59చూసినవారు
ఏప్రిల్‌ 8న కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ఏప్రిల్‌ 8, 9వ తేదీల్లో కాంగ్రెస్ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 8న కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం, 9న ఏఐసీసీ సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 27, 28, ఏప్రిల్‌ 3వ తేదీన ఢిల్లీలో దేశంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత డీసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్