ఏపీ ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో ఏపీ ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతినిచ్చింది. ఈ అకాడమీలో అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.