తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

83చూసినవారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు కావడంతో శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్