జమ్మూకశ్మీర్ ఎన్నికల బరిలో జేడీయూ

69చూసినవారు
జమ్మూకశ్మీర్ ఎన్నికల బరిలో జేడీయూ
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. జమ్మూకశ్మీర్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40 మంది అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షం కావడంతో తమ పార్టీలో భారీగా చేరికలు జరిగే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ జేడీయూ చీఫ్ షాహీన్ తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా, సెప్టెంబర్‌లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్